ఈనాడు- ఈటీవీ తెలంగాణ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం


సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కేంద్రంలో ఈనాడు- ఈటీవీ తెలంగాణ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వ్యక్తలు మాట్లాడుతూ ప్రపంచాన్ని ప్లాస్టిక్ ముంచెత్తుతుందని, ప్లాస్టిక్ శిథిలం కావటానికి వెయ్యి ఏళ్ళు పడుతుందని,ఏటా ప్రపంచ వ్యాప్తంగా 50 వేల కోట్ల ప్లాస్టిక్ బ్యాగులని వాడుతున్నారని,మానవాళికి ప్లాస్టిక్ తో ముప్పు ఉందని ప్లాస్టిక్ నివారణ పౌరునిగా ప్రతి ఒక్కరి బాధ్యతని ప్లాస్టిక్ కాలుష్యాన్ని అధిగమించటం నివారణ మన కర్తవ్యంమని ఈనాడు - ఈటీవీ తెలంగాణ ఆధ్వర్యంలో ఇలాంటి అవగహన కార్యక్రమాలు నిర్వహించటం ఎంతో అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీమతి లింగాల నిర్మల - లక్ష్మణ్ మరియు జడ్పీటీసీ సభ్యురాలు శ్రీమతి కనగండ్ల కవిత - తిరుపతి, సర్పంచ్ శ్రీమతి ద్యావనపల్లి మంజుల - శ్రీనివాస్, ఎంపీటీసీ శ్రీమతి గుబిరే శారదమల్లేశం, ఎంపీడీవో PC ఓబులేష్, ఎంపీవో శ్రీనివాస్, వైద్యాధికారి వినోద్ బాబ్జి, వీఆర్వో శ్రీకాంత్ రెడ్డి, ఉప సర్పంచ్ వేణు, వార్డ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు