SS NEWS : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులకు దసరా పండగ సందర్భంగా వేతనాలు చెల్లించేందుకు ప్రభుత్వం 83 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అడిగిన వెంటనే అంగన్వాడీ ఉద్యోగుల వేతనాల కోసం నిధులు విడుదల చేయడంపై గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ముఖ్యమంత్రి కేసిఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. అంగన్వాడి ఉద్యోగులకు జీతాలు ప్రతి నెల చివర లో వస్తుంటాయి. ఈ నెల దసరా పండుగ మొదటి వారంలో రావడంతో వేతనాలు లేకపోవడం వల్ల పండగకు ఆర్థికంగా ఇబ్బందిగా ఉందని తెలంగాణ రాష్ట్ర అంగన్వాడీ సంఘం నేతలు బుధవారం మంత్రి సత్యవతి రాథోడ్ ను కలిసి విజ్ణప్తి చేయడంతో వెంటనే మంత్రి సీఎం కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన సిఎం ఉద్యోగులకు వేతనాల కోసం నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. అడిగిన వెంటనే స్పందించి తమ సమస్యలను సిఎం కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లి పండగ కోసం వేతనాలు ఇప్పించిన మంత్రి సత్యవతి రాథోడ్ కి తెలంగాణ రాష్ట్ర అంగన్వాడీ ఉపాధ్యాయులు, ఆయాల సంఘం అధ్యక్షురాలు బిక్షపమ్మ ధన్యవాదాలు తెలిపారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి