అంగన్వాడీ కేంద్రానికి ఫ్యాన్ పంపిణీ


సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని నర్సింహులపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు ఎండకాలంలో ఉడక పరిస్థితి ఉందని అలాగే దోమలు, ఈగలకు పిల్లలు ఇబ్బంది పడుతిన్నారని అంగన్వాడీ టీచర్ మరియు ఆయా చెప్పడంతో వెంటనే స్పందించిన ఉప సర్పంచ్ కుంట హరికృష్ణ మరియు వార్డ్ సభ్యులు జెట్టి శ్రీనివాస్ గాంధీ జయంతిని పురస్కరించుకుని గ్రామ సర్పంచ్ కుసుంబ అంజవ్వ ఆధ్వర్యంలో ఫ్యాన్ అందజేసారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి వంశీ మరియు వార్డ్ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు