ఉచితంగా 105 హెల్మెట్లను పంపిణీ చేసిన ములుగు ఎస్సై రాజేంద్రప్రసాద్


సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గంలోని గంగాధరపల్లి గ్రామస్తులకు ఉచితంగా 105 హెల్మెట్లను పంపిణీ చేసిన ములుగు ఎస్సై రాజేంద్రప్రసాద్ VPO  ప్రేమ్ కుమార్ ద్వారా గ్రామంలో హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్నారని విషయం తెలుసుకున్న ఎస్సై ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గ్రామంలో మోటార్ సైకిల్ వాహనదారుల గురించి సర్వే చేసి 105 మందికి హెల్మెట్లు లేవని తెలుసుకొని ప్రముఖ వ్యాపారవేత్త మహేష్ దృష్టికి గగ్రామస్తులు తీసుకెళ్లగా వెంటనే తను 105 హెల్మెట్లను విరాళంగా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. తేదీ 08-10-2019 దసరా పండుగ సందర్భంగా మహేష్ మరియు ఎస్ఐ కలసి గ్రామస్థులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. హెల్మెట్లు విరాళం చేసిన మహేష్ ను మరియు ఎస్ఐ రాజేంద్రప్రసాద్ను గ్రామస్తులు సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ప్రతి మోటార్ సైకిల్  వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని హెల్మెట్ మీకు మరియు మీ కుటుంబానికి రక్షణగా ఉంటుందని తెలిపారు. హెల్మెట్ లేకుండా గ్రామస్తులు ఎవరైనా కనపడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్క వాహనదారుడు రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి క్షేమంగా గమ్య స్థానాలకు చేరుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదం వల్ల కుటుంబ యజమాని చనిపోతే కుటుంబం మొత్తం రోడ్డున పడుతుందని ప్రతి ఒక్కరు ఆలోచించుకుని తప్పకుండా హెల్మెట్ ధరించాలని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై ఈ చాలన్ ద్వారా కేసులు నమోదు చేస్తున్నామని వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ డాకుమెంట్స్, ఇన్సూరెన్స్, తప్పకుండా కలిగి ఉండాలని సూచించారు.  

కామెంట్‌లు