వీరాపూర్ గ్రామంలో మహిళ భవనానికి, స్మశాన వాటికకు శంకుస్థాపన చేసిన - ఎమ్మెల్యే రసమయి బాలకిషన్



సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని వీరాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ గన్నామనేని అనిత - బాలసుధీర్ రావు ఆధ్వర్యంలో మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో మహిళ భవనానికి మరియు స్మశాన వాటికకు శంకుస్థాపన చేసిన అనంతరం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మరియు జెడ్పీటీసీ కనగండ్ల కవిత - తిరుపతి, ఎం.పి.పి లింగాల నిర్మల - లక్ష్మణ్, MPTC ముక్కిస పద్మ - రాజిరెడ్డిలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ భాస్కర చారి, గ్రామశాఖ అధ్యక్షులు చిలుముల దేవదాస్, వివిధ గ్రామాల సర్పంచులు,MPTC  లు, వార్డు సభ్యులు, గ్రామ పంచాయితీ సిబ్బంది మరియు మహిళా సంఘాల మహిళలు, టిఆర్ఎస్ కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు