బుధవారం రోజు కాటారం మండల కేంద్రంలో స్వచ్ఛతయే ద్యేయంగా ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన ర్యాలీ సదస్సులో పాల్గొన్న జిల్లా జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి జక్కు శ్రీహర్షిని రాకేష్ మరియు జిల్లా కలెక్టర్ శ్రీవాసం వెంకటేశ్వర్లు ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేదించేలా చర్యలు చేపడుదాం,ముందు తరాల భవిష్యత్ కు జీవరాశులకు ప్లాస్టిక్ వల్ల ముప్పు కలిగి ఉన్న కారణంగా పూర్తిగా ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పంతకాని సమ్మయ్య , తెరాస మండలాధ్యక్షులు డోలి అర్జయ్య , సర్పంచ్ రాధమ్మ , ఉపసర్పంచ్ నాయిని శ్రీనివాస్ , ఎంపీటీసీలు తోట జనార్దన్ మరియు మహేశ్వరీ, గ్రామ ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి