వైద్యం చేయించుకోవడానికి డబ్బు లేక బీదరికంతో కన్నుమూసిన యువకుడు


సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని దాచారం గ్రామానికి చెందిన నేతి సురేష్ తల్లితండ్రులు క్రీ.శే. శ్రీనివాస్ - భవాని అనారోగ్యంతో చిన్నవయసులోనే మృతి చెందగా వారి ముగ్గురు కుమారులు ఎంతో ఆవేదనకు గురయ్యారు.వారిని వారి అమ్మమ్మ మైసవ్వ పెంచింది. పేదరిక కుటుంబం కావున ఉండటానికి ఇల్లు లేక ఎన్నో ఇబ్బందులు పడి ముగ్గురు అన్నదమ్ములు వారి స్వకృషితో ఇంటిని నిర్మించుకొని జీవనం సాగిస్తుండగా 19 సంవత్సరాల వయస్సున్నా నేతి సురేష్ అనరోగ్యానికి గురవ్వడంతో ఇద్దరు అన్నదమ్ములు మరియు అమ్మమ్మ వెంటనే కరీంనగర్ ఆసుపత్రికి తిసుకెళ్లిన ప్రయోజనం లేక వెంటనే హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లగా డాక్టర్లు బ్రతకడని చెప్పడంతో వైద్యం చేయించుకోవడానికి డబ్బులేక అమ్మమ్మ మరియు అన్నదమ్ములు ఇరువురు కన్నీరు మున్నీరుగా విలపించారు. వారి తోబుట్టు కళ్ళముందే కనుమారుగైతుంటే ఎంతో ఆవేదనతో ఇంటికి తీసుకువస్తుండగా కన్నుమూసాడు. ప్రజా ప్రతినిధులు మరియు గ్రామ ప్రజలు, యూత్ సభ్యులు, స్నేహితులు ఆర్థిక సహయం అందిచటంతో ఆంత్రక్రియలు నిర్వహించారు. ఈ బీద కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి చేయూతనందించాలని దాచారం గ్రామ ప్రజలు మరియు గ్రామ కుల సంఘాల పెద్దలు, ప్రజా ప్రతినిధులు, స్నేహితులు మరియు యువకులు వేడుకుంటున్నారు.

కామెంట్‌లు