ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతోన్న వేణుమాధవ్‌కు కిడ్నీ సమస్య కూడా రావడంతో కుటుంబ సభ్యులు ఇటీవల సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్లు ఆయనకు వెంటిలేటర్ సాయంతో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. మంగళవారం రోజు వేణుమాధవ్ మృతి చెందారు.

ఇటీవల హీరో రాజశేఖర్ మరియు ఆయన సతీమణి జీవిత యశోద ఆస్పత్రికి వెళ్లి వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితిని గమనించారు. కుటుంబ సభ్యులతో మరియు డాక్టర్లతో వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితి పై తెలుసుకున్నారని తెలుస్తుంది. ఇటీవల కోమాలోకి వెళ్లారనే పుకారు గట్టిగా వినిపిస్తోంది. వేణుమాధవ్ ఆరోగ్యంపై గతంలో చాలా రూమర్లు వచ్చాయి. ఆయన చనిపోయారంటూ కూడా ప్రచారం చేశారు. ఈ వార్తలపై వేణుమాధవ్ చాలా సార్లు స్పందించారు. తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఇప్పుడు వేణుమాధవ్ మృతిపట్ల ఇండస్ట్రీ కన్నీరు మున్నీరు అయింది. ఇదిలా ఉంటే, సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో వేణుమాధవ్ రాజకీయాల్లోకి వచ్చారు. నంద్యాల ఉపఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం చేశారు. ఆ తరవాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన స్వస్థలమైన కోదాడ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసినా ఎన్నికల అధికారి దాన్ని తిరస్కరించారు. దీంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. ఇక వేణుమాధవ్ సినిమాల విషయానికి వస్తే.. 1996లో ‘సాంప్రదాయం’ సినిమా ద్వారా నటుడిగా పరిచయమ్యారు. ‘మాస్టర్’, ‘తొలిప్రేమ’, ‘సుస్వాగతం’, ‘తమ్ముడు’ సినిమాలతో హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. దశాబ్దన్నర కాలంపాటు హాస్యనటుడిగా టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగారు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ‘హంగామా’ సినిమా ద్వారా ఆయన హీరోగా కూడా మారారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి