ప్రధాన కంటెంట్‌కు దాటవేయి
ఎమ్మెల్యే సతీష్ కుమార్ చొరవతో ఒకేరోజు 1100 రైతు బంధు పాస్ పుస్తకాలు కోహెడ మండలంలో రికార్డ్ సృష్టించిన రెవిన్యూ శాఖ
పాస్ పుస్తకాలు రైతులకు అందజేసిన ఎమ్మెల్యే
వొడితల సతీష్ కుమార్
సిద్దిపేట జిల్లా / కోహెడ (24 సెప్టెంబర్) : సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో రైతులు భూమి పాసు పుస్తకాల కోసం రెవిన్యూ కార్యాలయాల చూట్టు,అధికారుల చుట్టూ తిరిగినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితేల సతీష్ కూమార్ దృష్టికి రైతులు తీసుకువెల్లగా రైతుల బాధను గమనించిన ఎమ్మెల్యే ఈ విషయం పై వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ మరియు ఆర్డీవో, తహసీలార్లతో చర్చించి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ మేరకు రెవిన్యూ సిబ్బంది కోహెడ మండలం లోని ప్రతి గ్రామంలో సదస్సులు నిర్వహించి సాంకేతిక ఇబ్బదులు మరియు ఇతర సమస్యలు తెలుసుకొని పరిష్కరించడంతో మంగళవారం రోజు ఎమ్మెల్యే సతీష్ కుమార్ చేతుల మీదుగా 1100 మంది రైతుల పాసు పుస్తకాలను రైతులకు అందిచటంతో ఆ నిరుపేద రైతుల్లో సంతోషం వెళ్లువిరిసింది.ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పాస్ పుస్తకాలు తమ చేతిలోకి రావడంతో వాటిని చూసి రైతులు మురిసిపోయిన రైతులు ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపి హర్షం వ్యక్రం చేసారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి