ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా BSP జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దోళ్ల శ్రీనివాస్ యాదవ్ హాజరై మాట్లాడుతూ కాన్షిరాం చేసిన రాజ్యాధికార పోరాటాన్నికొనియాడారు. ఈ దేశంలో మెజార్టీ ప్రజలు అధికారం సాదించినపుడే నిజమైన సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. ఆ మార్పుకోసం యువత, మేధావులు, ప్రజలు కలిసి బహుజన ఉద్యమంలో కలిసి రావాలని కోరారు. అనంతరం రాజ్యాధికార ప్రతిజ్ఞ చేసారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోశాధికారి నిషాని రాజమల్లు మరియు మండల ఉపాధ్యక్షుడు సావనపెళ్లి రాజు, ప్రధాన కార్యదర్శి మాతంగి తిరుపతి, కోశాధికారి లింగాల శంకర్ బాబు, బోనగిరి లింగం, వేముల రాంచంద్రం, బెజ్జంకి చందు, బోనగిరి గంగారాం, మాల్యాల లింగయ్య, లింగాల శ్రీనివాస్, అయిలేని లచ్చిరెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు వార్డు మెంబర్స్ పుర్మ జగన్ రెడ్డి, సంగ కవిత - నరేష్, కూరేళ్ల బాలయ్య, లింగాల కల్పన - శంకర్ బాబు తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి